![]() |
![]() |
.webp)
పవన్ కళ్యాణ్ మూవీ డైలాగ్స్ చెప్పి ఆడియన్స్ లో ఒక జోష్ ని తీసుకొచ్చారు మానస్, రవికృష్ణ . సుమ అడ్డా షోలో ఈ సీన్ ని నెక్స్ట్ వీక్ చూడొచ్చు. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. దీనికి మానస్, కావ్య, రవికృష్ణ, శోభాశెట్టి వచ్చారు. " నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా మానస్ ..నీకు ఇష్టమైన యాంకర్ల పేర్లు చెప్పు" అని సుమ అడిగేసరికి "ఎవరు లేరు" అని చెప్పాడు. "హే గెలవాలి కదా సుమ, సుమ, సుమ అంటూ జపం చేసాడు" మానస్ . ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ని ఎడిటింగ్ లో తీసేసి ఈ పొగడ్త మాత్రం ఉంచండి అని చెప్పింది సుమ.
తర్వాత రవికృష్ణ-శోభాశెట్టిని స్టేజి మీదకు పిలిచింది. "నాకు దెయ్యం పట్టింది..కాబట్టి విరూపాక్షలో చేసినట్టు ఇప్పుడు కూడా చేయండి" అని రవిక్రిష్ణను అడిగింది సుమ. "మ్యానుఫ్యాక్చరింగ్ లోనే పట్టింది" అని కౌంటర్ వేసాడు రవి కృష్ణ. బ్యాక్ గ్రౌండ్ లో "నా ప్రేమను కోపంగానో" అనే సాంగ్ ప్లే అవుతుండగా శోభాసెట్టి రెడ్ రోజ్ ఇచ్చి రవికృష్ణకి ప్రొపోజ్ చేసింది. "ప్లీజ్ ఫీల్ మై లవ్" అని శోభా గట్టిగా అడిగేసరికి "ఇంతలా అడుగుతోంది కదా..ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు కామెడీగా రవికృష్ణ.
కావ్య తన చెల్లి అని ఆమె వెనక తిరుగుతున్న మానస్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రవికృష్ణ. "తాను నా చెల్లెలు...ఇంకోసారి తనతో కనిపించావంటే " అనేసరికి "షో ఐపోయాక కూడా ఇదే చెప్తావా...నువ్వు కళ్ళు మూసుకో నీ చెల్లేమిటి నేను కూడా కనపడని " అని మానస్ కౌంటర్ వేసాడు. "నందా, నందా, నందా ఇక్కడ అని రవికృష్ణ అనేసరికి హే నువ్వు నందా ఐతే నేను బద్రి, బద్రీనాథ్, ఐతే ఏమిటి" అని ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పుకున్నారు. ఇలా నెక్స్ట్ వీక్ సుమ అడ్డా షో ఎంటర్టైన్ చేయబోతోంది.
![]() |
![]() |